మీ ఇంట్లో దొంగతనం చేసాను ఏమీ అనుకోకండి ..

దొంగతనం చేసిన వ్యక్తి ఏం చేస్తాడు ? శుభ్రంగా సామాను మొత్తం అమ్మేసుకుంటాడు. కానీ ఇతను చేసిన ఘనకార్యం చూడండి .. మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో టీటీ నగర్ లో శాకీరా ఇంట్లో ఈ ఏడాది జనవరి నెలాఖర్ లో దొంగతనం జరిగింది ఆమె వెంటనే పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. కానీ ఐదు నెలలు గడుస్తున్నా ఎలాంటి రిప్లయ్ లేదు. దొంగ సంగతి ఆమెకి ఏ మాత్రం చెప్పలేదు పోలీసులు .

అసలే చిరాకుగా ఉన్న ఆమెకి ఒక లేఖ ఎదురైంది. ఆమె బయటకి వెళ్లి వచ్చే సరికి ఆ లేఖ ఇంటి గుమ్మం లో కనపడింది. దొంగ నుంచి నిన్న ఒక లేఖ వచ్చింది. అందులో దొంగతనం చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. అంతే కాకుండా చోరీ చేసిన సొత్తును త్వరలోనే అందజేస్తానని తెలిపాడు. ఆమె షాక్ అయ్యింది. తన పరిస్థితి ఆర్ధికంగా బాలేదు అనీ త్వరలో ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేస్తాను అని రాసాడు అందులో. ఆమె ఇంట్లో చోరీ చేసిన రెండు నగలు కూడా ఈ లెటర్ తో పాటు పెట్టాడు దొంగ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here