ముస్లిం యువకుడు – హిందూ యువతి .. ఒక్కటయ్యారు

మతాలు లెక్క కాదు మనుషులే లెక్క అని నిరూపించింది ఈ జంట. మతాల కంటే మనుషులుగా బతకడమే ముఖ్యం అని నమ్మిన ఈ యువతీ యువకులు తమ మత సాంప్రదాయాలకి భిన్నంగా వివాహం చేసుకున్న గహ్తన చోటు చేసుకుంది. దుబాయ్ కి చెందిన జునైద్ షేక్ డిల్లీ కి చెందిన గరిమా ప్రేమించుకున్నారు. సనాతన హిందూ కుటుంబం లో పుట్టింది యుతి కానీ యువకుడు మాత్రం ముస్లిం మతస్తుడు.

అయినా సరే వీరి ప్రేమ బలంగా కనపడ్డం తో తల్లి తండ్రులు సైతం అడ్డం చెప్పలేదు. దేశాలు వేరు, మతాలు వేరు అయినా మనసులు కలవడంతో తమతమ మత సంప్రదాయాలకు భిన్నంగా… వినూత్నంగా వివాహం చేసుకున్నారు. బంధుమిత్రుల హర్షాతిరేకం.. చప్పట్లు .. ప్రశంసల మధ్య తామిద్దరం ఒక్కటయ్యామని వారు ప్రకటించారు. ఈ క్షణం నుంచి తామిద్దరం దంపతులమని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here