2000 లో వచ్చిన రెసిషన్ మళ్ళీ రాబోతోందా ?

అధ్యక్షుడిగా పదవీ భాద్యతలు చేపట్టడం తోనే ఇండియన్ ఎంప్లాయీస్ కి చుక్కలు చూపిస్తున్నాడు డోనాల్డ్ ట్రంప్. సాఫ్ట్ వేర్ అంటే చాలు నాలుగు అంకెల్లో జీతం చవి చూసేవారు కూడా ఇప్పుడు నరకం అనుభవించే పరిస్థితి వచ్చేసింది. ప్రతీ ఏడాదీ పది నుంచి పదిహేను శాతం జీతం పెంపు లాంటి రాజ భోగాలు కూడా ఇప్పుడు లేవు. ట్రంప్ దెబ్బతో అమెరికన్ , భారత ఐటీ పరిశ్రమ లో ఇండియన్స్ మీద విపరీతమైన వివక్ష పెరుగుతోంది.

2000 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో ఏర్పడిని సంక్షోభం….ఇప్పుడు భారత్ లో ఏర్పడినట్టు అనిపిస్తోంది.  విప్రో , కాగ్నిజెంట్ , ఇన్ఫోసిస్ ఇలా ఎన్నెన్నో అమెరికన్ కంపెనీలు భారత ఎంప్లాయీస్ ని పీకి అవతల పారేస్తున్నాయి. దీనికి తోడు ఐటీ పరిశ్రమలో ఆటోమేషన్ విధానం కూడా ఉద్యోగులకు ప్రతికూలంగా మారింది. కాగ్నిజంట్ సంస్థ ముప్పై వేల మంది ఉద్యోగులని పీకడానికి సిద్దమవ్వగా క్యాప్ జెమినీ తొమ్మిది వేల మందిని పంపెస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here