శ్రీరామ అనే పదంలో దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసా!!!

ఓ ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్న తరువాత విడిపోయేటప్పుడు నీకు నాకు రాం రాం అంటుంటారు. మధ్యలో రాముడు ఏం చేశాడు. ఏ కార్యాన్ని తలపెట్టినా శ్రీరామ అని ఉచ్చరిస్తుంటాం. మరి ఆ శ్రీరామ అనే పేరు ఎందుకు వచ్చింది. ఆ పేరుకు ఎంత విశిష్టత ఉందో తెలుసుకుందాం.
రామునికి సంబంధించిన పురాణాల్లో శ్రీరామ అంటే – రాక్షస ఏన మరణం యాక్తి అంటే రాక్షస లో రా, మరణంలో మ . రాక్షసులందరూ కూడా ఎవరిచేత మరణాన్ని పొందుతారో వారే శ్రీరాముడని భావిస్తారు.

అందరికి తెలిసింది ఏంటంటే అష్టాక్షరీమంత్రంలో , నమోనారాయణలో రకారం. ఓ నమ:శివాయలో మకారం తీసుకొని వశిష్టుడు ఆ పేరుపెట్టాడు అని
రామాయణంలో రామశబ్ధానికి అర్ధం ఏంటంటే రమంతే యోగినో యంత్ర యోగేశ్వరులంతా భగవంతుని యందు మనసుని ఆస్వాదన చేసి నిలబెట్టుకుంటారు. ఆయనపేరు రాముడు రమో రమయతాం వరహ రామాయణంలో ఉంది.
పురాణాల్లో చమత్కారంగా రా అంటే మనలో ఉండే పాపాలు వాయు రూపంలో భయటకు పోతాయట. మ అంటే పెదాలు కవాటంలా మూసుకుంటాయి. అందుచేత రామశబ్ధం వచ్చేసరికి మన పాపాలన్నీ తొలగిపోతాయి అని అర్ధం.

అంతేకాదు వాల్మికి రామశబ్ధం చెప్పకుండా మరా చెప్పాడని మరా కాస్త రాం రాం అయిందని అంటుంటారు. ప్రజలందరికి రామ శబ్ధం లేనిదే రోజు గడవదంటే అర్ధం చేసుకోవచ్చు. రామ అనే పదంలో ఎంత అర్ధం ఉందో. తప్పుపలుకుదామన్న వీలులేనటువంటి పదం రామ రామ . శత్రవుల్ని కూడా ఆనందపెట్టేలాంటి శబ్ధం, గుణగణములు కలిగిన వాడు కనుక రామశబ్ధాన్ని వశిష్టమహర్షి అంత అందంగా పెట్టాడు. కనుకనే విశ్వామిత్రుడు ఎక్కడ రాముడ్ని పిలిచినా రమే రామేతి మధురాం వాణింజ్యాహ హార అంటాడు. ఇలా రామ శబ్ధం పలుకగానే మధుర అనకపోతే వశిష్టమహర్షికి నిద్రపట్టదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here