రాజకీయరంగ ప్రవేశంపై రజినీ కసరత్తు

సూపర్ స్టార్ రజినీకాంత్ పై వెల్లువెత్తుతున్న ఊహాగానాలకు ఇప్పట్లో తెరపడేలా లేదు. రాజకీయ రంగ ప్రవేశంలో భాగంగా రజినీ ఏప్రిల్ 2న అభిమానులతో సమావేశం కానున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతలోనే ఐదురోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ చెన్నైలోని రజినీ నివాసానికి వెళ్లడం హాట్ టాపిక్ అయింది. సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజ్ ఏంటో కొత్తగా చెప్పనక్కర్లేదు. తమిళ హీరో అయినా దేశవ్యాప్తంగానే కాదు.. విదేశాల్లోనూ ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళనాడు అభిమానులకు రజినీ దేవుడు. ఇలవేల్పుగా ఆరాధించే ఫ్యాన్స్ ఓట్లను క్యాష్ చేసుకొనేందుకు అనేక పార్టీలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గం ఆర్కే నగర్ కి జరుగుతున్న ఉపఎన్నిక పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ సమయంలో ఏప్రిల్ 2న సూపర్ స్టార్ అభిమాన సంఘాల భేటీ జరగనుంది. సరిగ్గా ఇప్పుడే మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ ఐదు రోజుల భారత పర్యటనకు వచ్చి నేరుగా చెన్నైలోని పోయెస్ గార్డెన్స్ లో ఉన్న రజినీకాంత్ నివాసానికి వెళ్లారు. దీంతో మలేసియా పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్ గా రజినీ ఎంపికయ్యారని.. మలేసియా ఎన్నికల్లో మద్దతు కోరేందుకే నజీబ్ వచ్చారనే వార్తలు వచ్చాయి.

అయితే ఇవన్నీ పుకార్లేనని రజినీ స్వయంగా కొట్టిపారేశారు. తాను కబాలీ షూటింగ్ జరిగేటపుడే ప్రధాని నజీబ్ ను కలవాలనుకోగా అది సాధ్యం కాలేదని.. అందుకే ఆయన ఇప్పుడు తన ఇంటికి వచ్చారని చెప్పారు సూపర్ స్టార్. చాలా కాలంగా తన వెన్నంటి నిలిచిన అభిమానులను కలుసుకోవాలనుకున్నట్టు.. అందుకే ఏప్రిల్ 11, 12న వారితో ఫోటో సెషన్ ఏర్పాటు చేసుకున్నట్టు రజినీ తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి తను నటిస్తున్న రోబో 2.0 షూటింగ్ పూర్తయిందని, దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి తన తొలిప్రేమ సినిమాయేనని చెప్పకనే చెప్పారు రజినీకాంత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here