అనుకోకుండా వచ్చే కష్టాల్ని జయించాలంటే…

అనుకోకుండా కష్టం వస్తే ఏం చేస్తాం. భూకంపం వచ్చి కాళ్లు భూమిలోకి కుంగిపోతున్నట్లుగా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ మంత్రాన్ని పటిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని వ్యాసుడు చెప్పాడు. అయితే ఈ స్లోకానికి మెరుపులకు చాలా దగ్గర సంబంధం ఉంది. సాధారణంగా ఉరుములు, మెరుపులు హటాత్తుగా వచ్చినప్పడు అర్జునా పాల్గొణ పార్ధో, బీభత్సో కిరీటీ దనుంజయ అని జపిస్తుంటాం. ఆ మంత్రానికి పిడుగులకు సంబంధం ఏంటీ అనేది మనకు విరాఠ పర్వంలో వ్యాసుడు చాలా చక్కగా వివరించాడు. అది పిడుగులు పడ్డప్పుడే కాదు, అనుకోకుండా వచ్చే కష్టాలనుంచి సర్వజయం కలగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ ఘట్టాన్నే తీసుకొని అర్జునుడు ఖాంఢవ దహనం చేశాడు. ఇంద్రుడు అద్భుతంగా వర్షాలు కురిపించాడు. ఇలా తలపెట్టిన కార్యం నిర్వఘ్నంగా నెరవేరడానికి ఈ స్లోకం చాలా బాగా పనిచేస్తుంది.

అర్జునహ ఫాల్గుణజిష్టుహు కిరీటీ శ్వేతవాహనహ

బీభత్సుర్విజయహ కృష్ణహ సవ్యసాచీ ధనంజయహ

పేర్లు చెప్పుకుంటే ఇంత లాభమా అని అనుకోవచ్చు. అది పేర్లలో ఉన్న గొప్పతనం

అర్జునహ – అంటే ఆర్జగుణం కలిగినవాడు. అంటే లోపలోమాట బయట ఒకమాట మాట్లాడేవాడు కాదు.

ఫాల్గుణ – ఉత్తర పల్గుణే నక్షత్రంలో జన్మించిన వాడు. ఎంతసాధించిన ఇది చాలు అననివాడు. కొత్తది సాధించే ప్రయంత్నం చేస్తాడు. అంటే అద్భుతమైన ఉత్సాహం కలిగిన వాడు.

జిష్టుహ యుద్ధానికి వెళితే గెలవడం తప్ప ఓడిపోవడం ఉండదు.

కిరీటి – ఎందరెందరో రాజుల చేత తలదించేలా చేయించాడు. కిరీటములను కిందికి దించేలా చేశాడు కనుక కిరీటీ. అందరికంటే పై స్థాయివాడు.

శ్వేతవాహనహ – తెల్లటి వాహనాల్ని చిత్రరధుడు ఇచ్చాడు. అందుకని శ్వేతవాహన

బీభత్సు – అతడు యుద్ధంలోకి అడుగుపెడితే బీభత్సమే. అంతగొప్పగా యుద్ధాలు చేస్తాడు కాబట్టే బీభత్సు.

బీభత్సుర్విజయహ ప్రకుష్టమైన జయం కలిగినవాడు.

కృష్ణహ – కృష్ణునికి ప్రీతి పాత్రుడనే కాదు ఓ రకమైన నల్లధనం కలిగినవాడు అని అర్ధం

సవ్యసాచీ ధనంజయహ కుడిచేత్తో, ఎడమ చేత్తో ఓ వేగంతో బాణం వేయగలిగిన వాడు అని అర్ధం. రాజసుయ యాగంలో దిక్కులను జయంచి ధనాన్ని పట్టుకొచ్చి ఇచ్చినవాడు అని అర్ధం. ఈ పదిపేర్లను స్వయంగా అర్జనుడే ఉత్తర కుమారుడికి చెబుతాడు. ఇలా తలుచునే యుద్ధానికి వెళ్లిన అర్జునుడే ఒంటిచేత్తో యుద్ధాన్ని జయించాడు. కాబట్టి ప్రతీ ఒక్కరు అనుకోకుండా వచ్చే కష్టాలనుంచి గట్టెక్కడానికి ఈ మంత్రం జపించాలని వ్యాసుడు తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here