అయేషా మీరా ని చంపడం వెనక అసలు కారణం ఇదే ..

అయేషా మీరా హత్య కేసులో సత్యం బాబు కి ఎనిమిది సంవత్సరాల తరవాత క్లీన్ చీట్ ఇచ్చింది కోర్టు. అసలు దోషులని పట్టుకోమని ఆ కుర్రాడి జీవితం నాశనం చేసారు అంటూ పోలీసుల మీద సీరియస్ అయ్యింది కోర్టు. సత్యం బాబు నిర్దోషిత్వం గురించి మాట్లాడిన అయేషా మీరా తల్లి శంషాద్ బేగం , తండ్ద్రి ఇక్బాల్ బాషా ఈ గొడవ మొత్తానికీ కారణం హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ అనీ ఆమె నోరు తెరిస్తే ఐదు నిమిషాల్లో కేసు మొత్తం సెట్ అవుతుంది అనీ అన్నారు.

పద్మ, ఆమె భర్త అయినంపూడి శివరామకృష్ణ, హాస్టల్ విద్యార్థులు సౌమ్య, ప్రీతి, కవిత, కోనేరు సురేశ్, కోనేరు సతీష్, అబ్బూరి గణేశ్ ఇలా ఎందరికో ఈ కేస్ తో సంబంధం ఉంది అనీ కానీ నోరు మాత్రం ఎవ్వరూ తెరవడం లేదు అని ఆమె చెప్పుకొచ్చారు. హాస్టల్ లో జరిగిన రాస లీలలు చూసింది అనే అయేషా ని వారు చంపేసారు అని ఆమె పేర్కొన్నారు. కేసు ని పోలీసులు పక్క దోవ పట్టించకుండా కోనేరు పద్మ ని పట్టుకుంటే అంతా బయటపడుతుంది అన్నారు ఆమె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here