అంజలి .. పెళ్లి అతనితోనే

సినిమా ఇండస్ట్రీ వారికి ప్రేమ ప్రయాణాలు కొత్త ఏమీ కాదు. వారు తమ ప్రేమ వ్యవహారం మొత్తం గుట్టుగా దాచుకుంటూ ఉంటారు. మీడియా కి లీక్ అయితే దొరికిపోయి సమాధానం చెప్పడం ఇష్టం లేక , ప్రేమ గురించి సైలెంట్ గా దాచుకుని నెమ్మదిగా తరవాత ఎప్పుడో ఓపెన్ అవుతారు. ప్రేమ లేదు ఏమీ లేదు మేము కేవలం ఫ్రెండ్స్ అన్న ఎందఱో హీరో హీరోయిన్ లు ఇప్పుడు కాపురాలు చేస్తున్నారు కూడా. తెలుగు హీరోయిన్ అంజలి ది కూడా అలాంటి వ్యవహారమే. సినిమా హీరో జయ్ తో కలిసి ఆమె తెగ తిరుగుతోంది. లివ్ ఇన్ రిలేషన్ లో కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దోసలు కూడా వేసుకుని లవ్ ని పంచుకుంటున్న వీరిని ఇదే మాట అడిగితే అబ్బే అదేమీ లేదు, మేము ఫ్రెండ్స్ అంటూ కహానీ చెప్పారు.

ప్రస్తుతం ఇద్దరూ ఇళ్ళలో తమ ప్రేమ సంగతి చెప్పుకుని అంతా సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది. తమ చేతిలో ఉన్న వివిధ చిత్రాలు పూర్తి అయిన తరవాత పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయ్యారు వీరు. అధికారికంగా పెళ్లి చేసుకోకపోయినా లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here