ఆ సినిమాకి 60 కోట్లు నష్టం

నాలుగు సంవత్సరాల క్రితం విడుదల అయిన విశ్వరూపం సినిమా అనేక సంచలనాలకి మూలంగా మారింది. వివాదాస్పద కాన్సెప్ట్ తో తెరకి ఎక్కిన ఈ చిత్రం తమిళనాట విడుదల అవ్వకుండా పెద్ద గొడవ చేసాయి ముస్లిం సంస్థలు. అప్పట్లో కమల్ కంట కన్నీరు కూడా కార్పించిన చిత్రం ఇది. కమల్ తీవ్ర ఆవేదన కి గురైన ఈ చిత్రం మొత్తం మీద విడుదల అయితే అయ్యేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. చాలా ఎక్కువ శాతం వసూళ్లు కూడా సాధించిన ఈ సినిమాకి అప్పట్లోనే వంద కోట్లు వచ్చాయి అని చెప్పుకునే వారు.

తమ హీరో ఇబ్బందులు పడలేదు అనీ డబ్బులు వచ్చేసాయి అనీ కమల్ ఫాన్స్ హమ్మయ్య అనుకున్నారు. కానీ ఆ సినిమాకి సంబందించిన ఒక పెద్ద విషయం కమల్ ఇన్నేళ్ళ తరవాత బయట పెట్టాడు. తమిళనాట ఈ సినిమాని అడ్డుకోవడం వలన తనకి చాలా పెద్ద నష్టం వచ్చింది అని ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు కమల్.విశ్వరూపం’ సినిమాకు రూ.60 కోట్ల నష్టం వచ్చిందని ఆయన తెలిపారు. ఇదంతా తమిళనాట అప్పుడు సినిమాను అడ్డుకోవడం వల్లేనని ఆశ్చర్య పరుస్తున్నారు కమల్. అరవై కోట్లు నష్టం ఈ సినిమాకి రావడం అంటే అది అసలు నమ్మశక్యంగా లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here