లోకేష్ కి ఈ పదవి పక్కా ..

ఏపీ లీడర్ లు అందరూ ఎన్నో సంవత్సరాల నుంచీ ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ ఘట్టం త్వరలో నిజం కాబోతోంది. ఇదిగో అదిగో అంటూ విస్తరణ గురించి న్యూస్ లు తప్ప ఇప్పటి దాకా కార్యదూపం కాస్తంత కూడా దాల్చని విస్తరణ మొత్తం మీద మొదలు అవుతోంది.
వివిధ వర్గాలకి న్యాయం చేస్తూ రెడ్డి , కాపు , బీసీ సామాజిక వర్గాలకి చెందిన వారికి ఛాన్స్ లు ఇవ్వడం ఉద్దేశ్యం గా చంద్రబాబు ప్రణాళిక ఉంది అని తెలుస్తోంది.

దాదాపు పది మందికి కొత్త ఛాన్స్ లు దక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు కొడుకు లోకేష్ , అఖిల ప్రియ వీరిద్దరికీ శాఖలు కూడా ఖాయం అయ్యాయి. లోకేష్ కి ఐటీ, మున్సిప‌ల్‌, పంచాయ‌తీ రాజ్ శాఖ‌ల‌లో ఏవైనా రెండు అప్ప‌గించే అవ‌కాశం ఉంది.
పార్టీ మారిన వారిలో సుజ‌య కృష్ణా రంగారావు, భూమా అఖిల‌ప్రియ‌కు అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. కొత్తగా ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్ధి గా రెడ్డి సుబ్రహ్మణ్యం పేరు ఖరారు చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here