కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్

స్టార్ హీరోల సినిమాలు చెప్పిన డేట్ కి విడుదల అవ్వడం గగనం అయిపొయింది. సినిమాల విడుదల కోసం షూటింగ్ ముహూర్తం టైం లోనే డేట్ ఇచ్చేస్తున్నారు కానీ ఆఖరిగా మాత్రం విడుదల ఉండడం లేదు. బాలీవుడ్ లో సినిమా మొదటి రోజే విడుదల తేదీ సాంప్రదాయం ఉంటుంది ఆ డేట్ కి ఎవ్వరూ వేరే సినిమా విడుదల చేసుకోరు. ఆ ట్రెండ్ ని ఇక్కడా మొదలు పెట్టిన తెలుగు హీరోలు కాస్త అటూ ఇటూ జరుగుతున్నారు.

కొందరు పోస్ట్ పోన్ చేస్తుంటే మరి కొందరు ప్రీ పోన్ చేస్తున్నారు. ఉదాహరణ కి కాటమరాయుడు 29 మార్చి న రావాలి కానీ 24 నే వచ్చేసింది. ఈ సినిమాకి నెగెటివ్ టాక్ ఉన్నా కూడా ఉగాది కలిసి వచ్చేలా ప్లాన్ చేసారు , లాంగ్ వీకెండ్ ఫెచ్చింగ్ అవుతూ ఫుల్ కలక్షన్ కుమ్మేస్తోంది ఈ చిత్రం. మార్చ్ 31 న విడుదల అయిన గురు చిత్రం ఏప్రిల్ ఏడు న డేట్ ఫిక్స్ చేసారు. కాటమరాయుడు టాక్ యావరేజ్ గా ఉండడం తో ఈ సినిమా పాజిటివిటీ పెరిగింది.
ఇలా ప్రీ పోన్ ట్రెండ్ ని మొదలు పెడుతున్నారు తెలుగు హీరోలు. ముందుగా అనుకున్న డేట్ కంటే చాలా ముందే షూటింగ్ అయిపోవడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here