సీరియల్ గా శివగామి చరిత్ర .. ఇండియన్ సీరియల్స్ లో సంచలనం

బాహుబలి రెండవ భాగం విడుదల కి దగ్గర అవుతోంది. బాహుబలి మొదటి భాగం తో ఫేమస్ అయిన శివగామి దేవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సీరీస్ కే వన్నె తెచ్చిన ఆమె ప్రతీ సీన్ లో రక్తి కట్టించారు. అయితే ఈమె కి సంబంధించి రైజ్ ఆఫ్ శివగామి అనే పుస్తకాన్ని తాజాగా తీసుకుని వచ్చారు. ఆ శివగామి క్యారెక్టర్ మీద ఒక టీవీ సీరీస్ కూడా ప్లాన్ చేస్తున్నారు.డైలీ సీరియల్ లాగా ఉండదు ఇది.కేవలం 13 ఎపిసోడ్ లలో సీజన్ వన్ టూ గా ప్లాన్ చేస్తున్నారు.

శివగామి ఎలా ఎదిగింది , ఎక్కడ నుంచి వచ్చింది అనేది ఆ పుస్తకం చెప్పే కథ. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ టీవీ సీరీస్ ని తీసుకుని వస్తున్నారు. శివగామి , కట్టప్పల మధ్యన అనుబంధం ఈ పుస్తకం లో ఉంటుంది. సింహాసనానికి కట్టప్ప ఎందుకు బానిస అనే విషయం కూడా యిందులో ప్రస్తావన కి వస్తుంది. మొత్తం మీద శివగామి మీద స్టోరీ , సీరియల్ అంటే టీవీ సీరియల్స్ చూసే
ఆడవాళ్ళు బాగా కనక్ట్ అవుతారు అనే ఉద్దేశ్యం తో ఈ సీరీస్ ప్లానింగ్ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here