ఇంట్లోంచి గెంటేశాక.. అసలు విషయం బయటికొచ్చింది!

బాలీవుడ్ లో ఖిలాడీ, జో జీతా వహీ సికందర్ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన నిన్నటి తరం డైరెక్టర్ కమ్ యాక్టర్ దీపక్ తిజోరి ఫ్యామిలీ లైఫ్.. లీగల్ ఇష్యూల్లో ఇరుక్కుంది. భార్య శివానీ.. దీపక్ తిజోరిని బలవంతంగా బయటికి గెంటేయడం.. సెన్సేషన్ అయ్యింది. ఈ వ్యవహారంలో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. 21 ఏళ్లుగా కలిసి జీవిస్తున్న దీపక్, శివానీకి అసలు లీగల్ గా పెళ్లే కాలేదన్న ముచ్చట.. ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనమవుతోంది.
ఈ ఇద్దరికీ.. 21 ఏళ్ల కూతరు కూడా ఉంది. దీపక్ కు వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో.. విడాకులు కోరుతూ శివానీ బాంద్రా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయడంతో.. గొడవ మొదలైంది. విడాకులు ఇప్పించడంతో పాటు.. తన ఖర్చులను దీపకే భరించేలా కోర్టు చూడాలని కోర్టును శివానీ కోరింది. అయితే.. ఇద్దరికీ లీగల్ గా పెళ్లే కాలేదన్న వార్తలతో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నదీ.. ఆసక్తిగా మారింది.

తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వని కారణంగానే.. దీపక్ ను లీగల్ గా శివానీ పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. ఈ విషయంలో శివానీ చెల్లెలు స్పందించింది. దీపక్, శివానీ మధ్య విభేదాలు ఉన్న మాట నిజమే అని ఒప్పుకున్న ఆమె.. ఇద్దరికీ పెళ్లి కాలేదన్న ప్రచారాన్ని మాత్రం తప్పుబట్టింది. ఇదంతా మీడియా సృష్టిగా చెప్పుకొచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి.. ఆదేశాల కోసం ఎదురు చూస్తే మంచిదని అభిప్రాయపడింది.

అయితే.. దీపక్ పై శివానీ కేసు వేసినట్టే.. దీపక్ కూడా శివానీపై కోర్టులో కేసు వేశాడు. ప్రస్తుతం అతను తన స్నేహితుల ఇళ్లలో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి గొడవను.. కోర్టు ఎలా పరిష్కరిస్తుందన్నదీ.. బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here