క్లాస్ రూమ్ లో ఆడపిల్ల బట్టలు ఇప్పిన టీచర్

విద్యాసంస్థలపైనా, టీచర్ల వ్యవహారంపైనా ఇటీవల ఎన్నో వార్తలు వెలుగుచూస్తున్నాయి. నాలుగు గోడల మధ్య తరగతి గదుల్లో విద్యార్థులపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ ఉపాధ్యాయురాలు ఓ విద్యార్థిని చావబాదిన తీరు వివాదాస్పదమైంది. నిమిషంలో 40 సార్లకుపైగా బెత్తంతో ఎడాపెడా బాదేసింది. తాజాగా రూ.70 దొంగిలించిందన్న ఆరోపణలతో ఓ బాలిక దుస్తులను విప్పించిందో టీచర్.
మధ్యప్రదేశ్‌లోని దమే  జిల్లాలో జరిగిందీ ఘటన. బాలిక తన డబ్బులు దొంగిలించిందంటూ మరో విద్యార్థిని టీచర్‌కు ఫిర్యాదు చేసింది. స్పందించిన టీచర్ తొలుత ఆమె పుస్తకాల సంచిని వెదికి చూశారు. అయినా డబ్బులు దొరక్కపోవడంతో బాలిక దుస్తులు విప్పి వెదకాలని మరో విద్యార్థిని ఆదేశించింది.
క్లాసు రూమ్‌లో తనకు జరిగిన అవమానంపై ఆమె స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో స్పందించిన డీఈవో పాఠశాలకు షోకాజ్ నోటీసు చేశారు. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here