గరుడ వేగ శాటిలైట్ + రీమేక్ హక్కులు కలిపి ఏడు కోట్లు ?

హీరో రాజశేఖర్ ఆయన భార్య జీవిత ఇప్పుడు ఫుల్ ఖుషీ లో ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచీ అంటే దాదాపు దశాబ్దం న్నర కాలం గా హిట్ సినిమా అనేది లేదు రాజశేఖర్ కి. ఇప్పుడు గరుడ వేగ సినిమా విజయం తో పండగ చేసుకుంటున్నాడు రాజశేఖర్ . ఈ సినిమా మొదట ప్రవీణ్ సత్తారు ప్రకటించినప్పుడు నవ్వినవాళ్ళు కూడా లేకపోలేదు రాజశేఖర్ మీద ముప్పై కోట్లు బడ్జెట్ ఏంటి అంటూ గేలి చేసారు.
ప్రవీణ్ సత్తారు ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. చందమామ కథలు , గుంటూర్ టాకీస్ లాంటి సైలెంట్ సినిమాలు తీసిన ప్రవీణ్ సత్తారు అనవసరం గా రిస్క్ చేస్తున్నాడు అన్నారు ప్రతీ ఒక్కరూ. సినిమా సంగతి పక్కన పెడితే హీరో రాజశేఖర్ కి అసలు మార్కెట్ అనేది లేనే లేదు. మినిమం నితిన్ లాంటి హీరోలకి కూడా ఉన్న మార్కెట్ లేదు రాజశేఖర్ కి . మొత్తం మీద సినిమా థియేటర్ లలోకి వచ్చింది సెకండ్ హాఫ్ లో కాస్త జోష్ తగ్గినా కూడా ఫస్ట్ హాఫ్ ఒక్కటీ చాలు ఈ సినిమా స్థాయి చెప్పడానికి. వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి.
శాటిలైట్ అన్నీ కలుపుకుంటే ముప్పై కోట్లు రావడం సాధ్యమైన పనే అన్నట్టు ఉంది పరిస్థితి. అయితే మొన్నటి వరకూ శాటిలైట్ కి పెద్దగా డబ్బు వస్త్తుంది అని ఊహించలేదు ఎవ్వరూ .. శాటిలైట్ కి ఆఫర్లు వచ్చినా కోటి కంటే తక్కువే రావడం తో ఒద్దులే అనుకుని ఊరుకున్నారు ప్రొడ్యూసర్.
ఇప్పుడు థియేటర్ లో సినిమా వచ్చిన తరవాత ఇప్పుడు వస్తున్న టాస్క్ దెబ్బతో ప్రవీణ్ సత్తారు , ప్రొడ్యూసర్ లకి శాటిలైట్ కోసం తెగ ఫోన్ లు వస్తున్నాయట .వేరే భాష లో పెద్ద హీరోతో రీమేక్ కోసం ప్లాన్ చేస్తున్నారు తమిళ , మలయాళం ప్రొడ్యూసర్ లు. ఇదంతా ఫస్ట్ డే టాక్ తరవాత జరిగిన రచ్చ.  సో రీమేక్ , శాటిలైట్ కలుపుకుని ఈజీ గా ఏడు కోట్ల వరకూ లాగచ్చు అని ప్లాన్ చేస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here