రశ్మీ లో సరకు అయిపొయింది .. ఆమె కోసం జనాలు థియేటర్ కి వచ్చే పరిస్థితి లేదు !

తెలుగునాట అనేక విషయాల్లో జబర్దస్త్ షో ఒక ట్రెండ్ సెట్టర్. సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న బూతు కామెడీ ని టీవీ తెర మీదకి తీసుకుని వచ్చిన ఈ షో అనసూయ , రశ్మి ల దయ వలన సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న ఎక్స్ పోజింగ్ ని కూడా టీవీ స్క్రీన్ మీదకి తీసుకుని వచ్చేసింది.
జబర్దస్త్ అనగానే కామెడీ ఎంతగా గుర్తుకు వస్తుందో అంతే లెక్కన మనందరికీ రశ్మి, అనసూయ అ అందాల ఆరబోత కూడా గుర్తుకు వస్తుంది. రశ్మి , అనసూయ లు నెమ్మదిగా సిల్వర్ స్క్రీన్ ఎక్కడానికి కూడా ఈ షో బాగానే ఉపయోగ పడింది. మొత్తం మీద అడపా దడపా పాత్రలు చేస్తున్న రశ్మి గుంటూర్ టాకీస్ సినిమా విషయం లో చాలా బెనిఫిట్ అయ్యింది.
ప్రొడ్యూసర్ లు ఆ సినిమా గురించి భయపడిన టైం లో ఆమె అందాలు జనాలని థియేటర్ లకి రప్పించాయి కూడా. ‘గుంటూరు టాకీస్లో’ ర‌ష్మీ విచ్చ‌ల‌విడిగాచ న‌టించేసి – త‌న ఇమేజ్ ఇంకా ఇంకా పెంచుకొంది. దాంతో ర‌ష్మీకి ఆఫ‌ర్లు వ‌రుస క‌ట్టాయి. దాంతో పాటు పారితోషికం కూడా భారీగా ముట్ట‌జెప్పాల్సివ‌చ్చింది. కొన్ని సోలో సినిమాలు చేసిన రశ్మి అనసూయ లాగా రేర్ క్యారెక్టర్ లు ఎంచుకోలేదు. పారితోషికం కోసమో మరే కారణమో కానీ చిన్న చిన్న బ్యానర్ లలో సినిమాలకి సంతకం పెట్టేస్తోంది.
రశ్మి కనపడితే బీ సి సెంటర్ జనాలు థియేటర్ లకి వస్తారు అనే ఉద్దేశ్యం తో ప్రొడ్యూసర్ లు కూడా ఆమెకి గట్టిగానే ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యన ‘నెక్ట్స్ నువ్వే’ సినిమాలోనూ రష్మి ఓ పాత్ర ద‌క్కించుకొంది. ట్రైల‌ర్‌లో సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్ ర‌ష్మీనే. త‌నతో డ‌బుల్ మీనింగ్ డైలాగుల్ని కూడా ప‌లికించి.. ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు. ర‌ష్మి వ‌ల్ల బీ,సీల్లో టికెట్లు తెగ‌డం ఖాయం అనుకొన్నారంతా.
కానీ ర‌ష్మీ ఎఫెక్ట్ అంత‌గా క‌నిపించ లేదు. బీ,సీల్లో ఈ సినిమా వ‌సూళ్లు అంతంత‌మాత్రంగానే క‌నిపిస్తున్నాయి. పైగా.. తెర‌పై ర‌ష్మీ చేసిందేం లేదు. ట్రైల‌ర్‌లో ఇచ్చిన కిక్‌… వెండి తెర‌పై ర‌ష్మీ ఇవ్వ‌లేక‌పోయింది. పైగా… ముదిరిన ల‌క్ష‌ణాలు.. లక్ష‌ణంగా క‌నిపించాయి. న‌ట‌న‌లోనూ అంతంత మాత్ర‌మే. ఇక మీద‌ట ర‌ష్మీ కాల్షీట్ల కోసం కాసులు రాల్చేముందు నిర్మాత‌లు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here