ఇంత హడావిడి చేసి సినిమా వాయిదా వేసిన సిద్దార్థ్

హీరో సిద్ధార్థ్ నిర్మాతగా సొంత బ్యానర్లో ఒక హారర్ థ్రిల్లర్ సినిమా చేశాడు. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను ఒకే రోజున ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు చెప్పాడు. ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ పెట్టేసి .. నవంబర్ 3వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెప్పాడు. తెలుగులో ఈ సినిమాకి ‘గృహం’ అనే టైటిల్ ను ఖరారు చేశాడు. అయితే తెలుగులో విడుదలను వాయిదా వేశాడనేది తాజా సమాచారం.
 రేపు ‘గరుడ వేగ’ .. ‘ఏంజెల్’ .. ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దాంతో థియేటర్స్ కొరత ఏర్పడింది. సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్న సిద్ధార్థ్, రిలీజ్ ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది త్వరలోనే తెలియజేస్తాడట. తమిళంలో మాత్రం ఈ సినిమా రేపే విడుదలవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here