నాగార్జున సినిమా – ఎన్టీఆర్ సినిమా ఒకేసారి సంతకం పెట్టిన టబూ

చాలాకాలం తరువాత నాగార్జునతో రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు. వర్మ సొంత బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో కథానాయికగా ‘టబు’ పేరు వినిపిస్తోంది. హీరోయిన్ ఎంపిక విషయాన్ని నాగ్ కి వదిలేయడంతో, ఆయన ‘టబు’ను రంగంలోకి దింపుతున్నట్టుగా సమాచారం. గతంలో ఆమె నాగ్ జోడీగా ‘నిన్నే పెళ్లాడుతా’ .. ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలు చేసింది.
 ఇక త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం ‘టబు’ను అనుకుంటున్నారట. సినిమాలోని కీలకమైన పాత్రలను సీనియర్ హీరోయిన్స్ తో చేయించడం త్రివిక్రమ్ కి అలవాటే. ఆ పాత్రలు వాళ్లకి మంచి పేరు .. అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి కూడా. ఈ సారి వంతు ‘టబు’దన్న మాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here