మూత్రం బాగా వస్తోందా.. ఉప్పు తగ్గించేయండి

మీకు రోజూ విపరీతంగా మూత్రానికి వెళ్లాల్సివస్తోందా.. ఈ సమస్యతో అందరి ముందు ఇబ్బంది పడుతున్నారు.. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పదే పదే వాష్ రూమ్ వెళ్లాల్సి వస్తోందా.. అయితే.. ఇదిగో ఇలా చేయండి అని పరిశోధకులు చెబుతున్నారు. జపాన్ లోని నాగసాకి యూనివర్సిటీ పరిశోధకులు.. ఈ సమస్య పరిష్కారానికి ఓ చిట్కా కనుగొన్నారు.

కొందరు వాలంటీర్లను గుర్తించిన నాగసాకి రిసెర్చర్లు.. వారికి రోజూ వాడే ఉప్పును 10.7 గ్రాములనుంచి 8 గ్రాములకు తగ్గించాలని సూచించారట. అంటే.. రోజూ వాడే ఉప్పులో కనీసం 25 శాతం తగ్గించాలని చెప్పారట. ఇలా దాదాపు 12 వారాల పాటు ఉప్పు తగ్గించిన తర్వాత రోజూ వారి పరిస్థితిని గమనిస్తే.. సగటున రోజూ రాత్రి పూట 2 సార్లు మూత్రాన్ని తక్కువగా పోశారట.

అలాగే.. మరికొంత మందికి రోజూ వాడే 9.9 శాతం ఉప్పుకు బదులుగా.. 11 శాతం ఉప్పు వాడాలని సూచించారు. వారిని కూడా 12 వారాల పాటు అబ్జర్వ్ చేస్తే.. రోజూ రాత్రి పూట పోసే మూత్రం కంటే.. దాదాపుగా 3 సార్లు ఎక్కువగా మూత్రం పోశారట.

ఈ రెండు ఫలితాలను విశ్లేషిస్తున్న పరిశోధకులు.. రాత్రి వేళ మూత్ర సమస్యనుంచి ఇబ్బంది తగ్గించుకోవాలంటే.. రోజూ తినే ఉప్పును కూడా తగ్గించుకోవాలని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here