గోవును చంపితే.. కాళ్లు, చేతులు విరగ్గొడతాం!!

గోమాతను కాపాడడం మంచిదే. గో వధను అడ్డుకోవాలన్న డిమాండ్ కూడా సరైనదే. ఇందులో ఏ తప్పూ లేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ డిమాండ్ బాగానే వినిపిస్తోంది. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వం కాబట్టి అలా కోరడం కూడా ఏ మాత్రం తప్పు కాదు. కానీ.. ఈ మధ్య బీజేపీ నేతలు ఈ డిమాండ్ తోపాటు.. వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. అలా చేయకుంటే.. కాళ్లూ, చేతులూ విరగ్గొడతామని కూడా బెదిరిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని కబౌలీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నాయకుడు విక్రమ్ సైనీ.. ఈ కామెంట్లు చేశారు. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘వందేమాతరం. భారత్ మాతా కీ జై’ అనేందుకు ఆలోచించే వారిని ఇకపై వదిలేది లేదని చెప్పారు. అంతే కాదు.. కన్నతల్లిలా పరిగణించే గో మాతను చంపే వాళ్లనూ వదిలేది లేదన్నారు. వాళ్ల కాళ్లూ చేతులూ విరగ్గొడతామని ఓపెన్ గా చెప్పేశారు.

దీంతో.. విక్రమ్ పై ప్రత్యర్థి పార్టీల విమర్శలు పెరుగుతున్నాయి. గోవధలను అడ్డుకునేందుకు చాలా మార్గాలున్నాయని.. ప్రజల నుంచి, ప్రత్యర్థుల నుంచి ఇబ్బంది రాకుండా అలాంటి పని చేస్తే బాగుంటుందన్న సలహాలు కూడా విక్రమ్ కు అందుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here