విజయ్ సినిమాకు.. శింబు మ్యూజిక్?

తమిళ సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ వార్త దాదాపుగా కన్ఫమ్ అయినట్టే. అది కూడా.. ఏదో ఓ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టర్ గా కాదు. రియల్ మ్యూజిక్ డైరెక్టర్ గా శింబు బిజీ కాబోతున్నాడు. నటుడిగా మాత్రమే కాకుండా.. సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా శింబు ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు.

సంతానం హీరోగా నటిస్తున్న ఓడి ఓడి ఉళుక్కునుమ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్న శింబు.. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ విజయ్ చేయబోతున్న సిమాకు కూడా సంగీతాన్ని అందించబోతున్నాడట. ఓ మామూలు హీరోకు.. ప్రయోగాత్మకంగా మ్యూజిక్ అందివ్వడం అంటే.. అది సరదాగా చేస్తున్న ప్రయత్నం అనుకోవచ్చు. కానీ.. సీరియస్ గానే.. శింబు ఈ సినిమాకు మ్యూజిక్ చేసేందుకు ఉత్సాహంగా.. ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

వాలు అనే సినిమా విడుదల విషయంలో ఇబ్బంది ఎదురైనపుడు.. అనకు అండగా నిలచిన విజయ్.. సినిమా విడుదలకు కారణమయ్యాడన్న కృతజ్ఞతతోనే శింబు మ్యూజిక్ చేయాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతానికి ఈ విషయం కన్ఫమ్ కాకున్నా.. కోలీవుడ్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఇది నిజమే అని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here