సిమ్ కార్డులపై వస్తున్నాయ్.. కొత్త ఆంక్షలు

దేశంలో 125 కోట్ల మంది ప్రజలు ఉంటే.. 100 కోట్ల మంది మొబైల్ వాడుతున్నారు. అంటే.. 100 కోట్ల మందిలో ప్రతి ఒక్కరికీ ఒక్కో కనెక్షన్ ఉందని అర్థం కాదు. ఒక్కొక్కరికీ 2 లేదా 3 లేదా అంతకంటే ఎక్కువ కనెక్షన్లు లేదా సిమ్ కార్డులు మెయింటైన్ చేసేవాళ్లు దేశంలో చాలా మంది ఉన్నారు. అలా.. అందరూ వాడే కనెక్షన్లు అన్నీ కలిపి 100 కోట్ల వరకూ ఉన్నాయి. ఇందులో.. కొందరు తప్పుడు చిరునామాలు ఇస్తూ.. తప్పుడు పనులు చేసేవాళ్లు కూడా ఉన్నారు.

గతంలో సిమ్ కార్డ్ కావాలంటే.. చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. వెయిటింగ్ పీరియడ్ కూడా ఉండేది. కానీ.. ఇప్పుడు గల్లీకి కనీసం 2, 3 అడ్డాల్లో సిమ్ కార్డులు ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సిమ్ కార్డు తీసుకునే వ్యక్తి అడ్రస్ ను సరిగా ధృవీకరించకుండానే.. సిమ్ కార్డు యాక్టివేట్ అవుతుండడం.. తర్వాత జరగరాని ఘోరాలు జరుగుతుండడం ఎప్పుడో ఒకప్పుడు గమనిస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితికి చెక్ పెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

ప్రస్తుతం కొత్తగా సిమ్ కార్డు తీసుకునేవారి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న నెట్ వర్క్ ప్రొవైడర్లు.. ఇప్పుడు కేంద్రం చేసిన సూచనల ప్రకారం.. ఆల్రెడీ సిమ్ కార్డులు ఉన్నవారికి కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ తో అనుసంధానం చేసి ఈ-కేవైసీ విధానంలో పరిశీలన చేస్తారు. సిమ్ కార్డు వాడుతున్న వ్యక్తికి ఓ కోడ్ నంబర్ ను పంపించి.. ఈ-కేవైసీ ప్రక్రియ ప్రారంభిస్తారు.

తమ దగ్గరున్న వివరాల ప్రకారం.. వినియోగదారుడి దగ్గరే సిమ్ కార్డు ఉందని కన్ఫమ్ చేసుకున్నాక.. డేటాబేస్ లో అన్ని వివరాలు రికార్డ్ చేస్తారు. తర్వాత.. ఆ నంబర్ కు సంబంధించి ఏ వివరాలనైనా.. సిమ్ కార్డు వాడుతున్న వ్యక్తి నుంచే సేకరిస్తారు.

దీనికి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే మీడియాలో ప్రకటనలతో పాటు.. మొబైల్ వాడే అందరికీ మెసేజ్ ల రూపంలో వివరిస్తారు. త్వరలోనే దీనికి సంబంధించి.. మరింత క్లారిటీ రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here