రోడ్డు మీదనే హైదరాబాద్ లో అమ్మాయిని కిడ్నాప్ చెయ్యడం కోసం ..

హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజీ దగ్గర పగలూ రాత్రీ అనే తేడా లేకుండా ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది. ఒక యువతిని ఈ ప్రాంతం లో కాసేపటి క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నం చేసారు. గత రాత్రి హాస్టల్ కి వెళ్ళిన యువతిని రోడ్డు మీద ఏడిపించిన కొందరు ఆకతాయులు వెంటనే ఆమె తో గొడవ పది కిడ్నాప్ చేస్తాం అతనూ బెదిరించారు. దాంతో ఆమె వారితో రోడ్డు మీదనే వాగ్వాదానికి దిగింది. కాసేపటికి వారు నిజంగానే కిడ్నాప్ కి ప్రయత్నం చేసారు. దాంతో ఆమె గట్టిగట్టిగా అరవడం మొదలు పెట్టంది.
విద్యార్ధినులు , విద్యార్ధులు వెంటనే వచ్చి ఆమెకి సపోర్ట్ ఇవ్వడం తో కిడ్నాప్ కి యత్నించిన వారు పారిపోయారు. కిడ్నాప్ కు ప్రయత్నించిన ఓ నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. హాస్టల్ దగ్గరలో వీధి లైట్ లు అనేవి లేకపోవడం తో తేలికగా అమ్మాయిని ఎత్తుకుపోవచ్చు అన్ని అక్కడ
మకాం వేసినట్టు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here