తనకంటే ఇరవై సంవత్సరాల చిన్నవాడిని పెళ్లి చేసుకుంది…

ప్రపంచపు అత్యంత శక్తివంతమైన నాయకుల లిస్టు లో వ్లాదిమర్ పుతిన్ ఒకరు. రష్యా రాజకీయాలలో ఎప్పటి నుంచో ఉంటూ తిరుగేలేని ఒక శక్తి గా ఆయన ఎన్నో విమర్శలు కూడా ఎదురుకుంటున్నారు. రాజకీయ జీవితం తో పాటు వ్యక్తిగత విషయాల్లో కూడా పుతిన్ కి ఉన్నన్ని వివాదాలు ఎవ్వరికీ లేవు. దాదాపు ముప్పై సంవత్సరాలు కలిసి ఉన్న భార్య కి మూడేళ్ళ క్రితం ఆయన విడాకులు ఇచ్చారు. ఆయన భార్య లుడ్మిలా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

గూడచారి సంస్థ లో పని చేసిన టైం లో ముప్పు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న ఇద్దరూ ఎన్నో సంవత్సరాలు అన్యోన్యం గా ఉన్నారు. పుతిన్ ఆమెతో విడాకులు ఎందుకు తీసుకున్నారు అనేది కూడా ప్రపంచానికి తెలీదు. కాగా ఆమె ఎక్కడ ఉంది ఎం చేస్తోంది అనేది ఇన్ని సంవత్సరాలూ ఎవ్వరికీ తెలీదు. త‌న కంటే 20 ఏళ్ల చిన్న‌వాడైన బిజినెస్ మ్యాన్ ఆర్థ‌ర్ ఓషెరెట్నీని పెళ్లి చేసుకున్న స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం వారు ఫ్రాన్స్ లోని ఒక విల్లాలో ఉంటున్న‌ట్లుగా తెలుస్తోంది. విమానాశ్రయం లో కూడా ఈ జంట కలిసి కనపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here