రజిని రాజకీయాల గురించి మణిరత్నం కామెంట్ లు ..

కొంతమంది లెజెండ్రీ వ్యక్తులు మరి కొంతమంది లెజెండ్రీ వ్యక్తుల మీద కామెంట్ లు చేస్తే ఆసక్తిగా చూస్తారు జనాలు. మణిరత్నం తన సినిమాల గురించి మాట్లాడడమే చాలా తక్కువ. తన సినిమాలే మాట్లాడాలి తప్ప తాను కాదు అంటూ ఉంటారు ఆయన. అయితే ఈ మధ్యన మీడియా ముందర తప్పదు అన్నట్టు మాట్లాడుతున్న మణిరత్నం ప్రమోషన్ లలో భాగంగా అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం కూడా వాటిల్లో ఒకటు. రజిని రాజకీయాలలోకి రావాలి అని డిమాండ్ చెయ్యడం ఎవ్వరికీ సాధ్యం కాదు అంటున్నారు మని. ” అది ఆయన వ్యక్తిగతమైన విషయం. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్నా ఆయన తీసుకోవాలి. అందరి లాంటి మామూలు మనిషే ఆయన. సో ఒత్తిడి ఉండకూడదు. తనకు.. ప్రజలకు ఏది మంచిదనిపిస్తే అది చేస్తాడు రజినీ’’ అని మణిరత్నం అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here