ధోనీ పీకింది ఏమీ లేదు .. పూనే ఓనర్ సంచలన వ్యాఖ్యలు :

ఐపీఎల్ సీజన్ లో ధోనీ ని కెప్టెన్ గా తీసేసి కేవలం ఆటగాడిగా పెట్టిన టీం యజమాని సంజీవ్ గోయింకా తమ్ముడు హర్ష్ గోయంకా ధోనీ ని తిడుతూ , స్మిత్ ని ఆకాశానికి ఎత్తేస్తూ చేసిన వ్యాఖ్యలతో ఇంటర్నెట్ జనాలు పిచ్చ కోపంగా ఉన్నారు. ముంబై మీద అనూహ్య విజయం తరవాత స్మిత్ ని పోగిదేసిన అతను . ధోనీ కేవలం ప్రేక్షక పాత్ర వహించిన టైం లో స్మిత్ అడవికి రారాజు తానే అని నిరూపించాడు అని ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ సంచలనం అయ్యింది.

ధోనీ అభిమానులు అందరూ గోయంకా మీద సీరియస్ అయ్యారు.ఆసీస్ ఆటగాడిని ధోనీ తో పోల్చడం సిగ్గు చేటు అన్నారు. కేవలం ధోనీ వల్లే పుణె జట్టును అభిమానిస్తున్నామని, తాము స్టేడియానికి వచ్చిందే ధోనీ కోసమని తేల్చి చెప్పారు. ధోనీ లాంటి దిగ్గజాన్ని ఒకే ఒక్క మ్యాచ్ తో ఎలా వేరేవారితో కంపేర్ చేస్తారు అంటూ గొడవ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here