త్వరలో అమెరికా రష్యా ల మధ్యన యుద్ధం ?

ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులని లక్ష్యం గా తాము ఇంకా చాలా దాడులు చేస్తాం అని అమెరికా సంచలన ప్రకటన చేసింది. సిరియా లో అధ్యక్షుడి సైన్యం ఆగడాలు తాము చూస్తూ ఊరుకోము అని అమెరికా గట్టిగ సమాధానం చెప్పింది. ” వారి దేశం లో ఉన్న మొత్తం ఎయిర్ బేస్ లని అన్నింటినీ నాశనం చేస్తాం ” అంటూ చెప్పుకొచ్చింది అమెరికా. తోమాహిక్ క్షిపణి దాడి ని అమెరికా లోని వైట్ హౌస్ సమర్ధిస్తోంది కూడా. అమాయక పౌరులని , పిల్లలని ఆ దేశం ఇష్టం వచ్చినట్టు చంపుతూ ఉంటే ఊరుకోము అంటోంది అమెరికా.

తాజా గా అమెరికా ఈ ప్రకటన చెయ్యగా దానికి రష్యా స్పందిస్తూ. ఇంకొక్కసారి ఇలాంటి దాడి చేస్తే చూస్తూ ఊరుకోము అని వార్నింగ్ ఇచ్చింది. సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అణచివేతే లక్ష్యంగా ప్రభుత్వ సైన్యం పని చేస్తోందని కితాబిచ్చింది. చూడబోతే త్వరలో రష్యా ఆమెరికా ల మధ్యన పెద్ద యుద్ధమే వచ్చేలా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here