శ్రీరామ నవమిలో పానకం ఎందుకు తాగుతారో తెలుసా

హిందువులు జరుపుకునే అత్యంత ప్రీతి పాత్రమైన పండుగ శ్రీరామనవమి. ఈ పర్వదినం సందర్భంగా సీతారాముల కల్యాణాన్నిఅత్యంత వైభవంగా భక్తజన సందోహం మధ్య సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చే ఈ పండుగ సీతారాములకు ఎంతో ఇష్టమైన శుభదినం. పెళ్లితోపాటు మనం చెప్పుకోదగ్గ అంశం పానకం. శ్రీరామనవమి రోజు పానకం ఎందుకు పంచుతారు. అంటే చాలామందికి తెలియని విషయం. పానకం శ్రీరాముడికి, సీతమ్మవారికి ఇష్టమని, వారి పెళ్లి సందర్భంగా పానకాన్ని పంచుతారని చెబుతారు. అదెలా ఉన్న పానకం ఆరోగ్యానికి చాలా మంచిది. పానకం సర్వరోగ నివారిణి.
పానకంలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియం ఖనిజాలు ఉంటాయి. ఆ ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
 ఆయుర్వేదం ప్రకారం వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి…పెళ్లితంతు జరిపేందుకు కావాల్సిన ఉత్సాహాన్ని అందిస్తుంది కాబట్టే పానకం తంతును ప్రవేశపెట్టారు.
బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి.
 పానంకంలో వేసే మిరియాల గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం లో వడపప్పుకు చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టే శ్రీరామనవమి లో పానకానికి ఇంత ప్రసిద్ధి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here