బాహుబలి కాలకేయుడిని ఎయిర్పోర్ట్ లో వెళ్ళనివ్వ లేదు

నటుడు ప్రభాకర్ ని తెలుగు జనాలు బాహుబలి కాలకేయుడు గా బాగా గుర్తు పడతారు. మర్యాద రామన్న తో విలన్ గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ బాహుబలి మొదటి భాగం లో కాలకేయుడు గా చేసి ఫుల్లు పేరు తెచ్చుకున్నాడు. రాజమౌళి మీద ప్రేమతో ఆయన తన పెద్ద కొడుక్కి రాజమౌళి అని పేరు కూడా పెట్టేసుకున్నాడు.
రాజమౌళి వలన , బాహుబలి వలన తనకి కలిగిన బెనిఫిట్ ల గురించి చెబుతున్న ప్రభాకర్ , ఒక రోజు డిల్లీ ఎయిర్ పోర్ట్ లో పాస్ పోర్ట్ టైం అయిపోయినా తాను ఎలా వెళ్ళాడో చెబుతున్నాడు. “ఆ రోజు ఎయిర్పోర్ట్ లో టైం ఐపోయింది, నేను సినిమా నటుడుని అని బాహుబలి లో కాలకేయుడు నేనే అని వీడియో తీసి చూపించాను. వెంటనే అధికారులు నన్ను అనుమతించారు. ఐతే నా ఫేవరెట్ క్యారెక్టర్ ఏదంటే మాత్రం కాలకేయ కాదు ‘మర్యాద రామన్న’లోని బైర్రెడ్డి పాత్రే అంటాను. ” అని చెప్పుకొచ్చాడు ప్రభాకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here