జనసేన లోకి జయప్రకాశ్ , గద్దర్ , కోదండరాం రారు .. కారణం !

జన సేన పార్టీ పెట్టిన క్షణం నుంచీ పవన్ భావాలని అర్ధం చేసుకుని అతనితో చేయి కలుపుతున్నవారు బోలెడు మంది ఉన్నారు. మేధావి వర్గం వారు ఆయన ఎదో మార్పు తీసుకుని వస్తాడు అనే ఆలోచన తోనే ఉన్నారు. పవన్ భావజాలం మీద చాలా వరకూ సానుకూలంగా స్పందిచే వారు ఇప్పుడు పవన్ తెలంగాణా లో కూడా పోరాడతాను అక్కడ కూడా పోటీ చేస్తాను అని చెప్పడం తో అంత సీన్ ఉందా అంటున్నారు. తెలంగాణా మీద పవన్ శ్రద్ధ పెట్టడం లేదు అనీ ఇక ఒక్క ఓటు కూడా అతనికి సానుకూలంగా పడే పరిస్థితి లేదు అని చాలా మండే కామెంట్ చేస్తున్నారు.

తెలంగాణా విప్లవకారుడు గద్దర్ పవన్ మీద సానుకూలంగా ఉన్నారు అనీ ఇద్దరూ కలిసే తెలంగాణా లో వచ్చే ఎన్నికల్లో జనసేన తరఫున పోరాటం చేస్తారు అని చెబుతున్నారు చాలా మంది. ఆయనే కాకుండా జయప్రకాశ్ నారాయణ , కోదండరాం వీరందరూ జనసేన తో కలిసి పోరాటం చేస్తారా అంటే అనుమానమే అంటున్నారు చాలా మంది. ఒకే ఒరలో ఇన్ని కత్తులు ఇమడవు అనేది ఇక్కడి మెయిన్ లాజిక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here