వామ్మో..నూడుల్స్ లో పాముపిల్ల‌లు..జ‌ర‌సోచో

నూడుల్స్ చిన్న‌పిల్ల‌లు ఎంత ఇష్టంగా తింటారో ..పెద్ద‌లు కూడా ఆక‌లైన‌ప్పుడు నూడుల్స్ ను ఆవురావురు మంటూ లాగించేస్తుంటారు. ఈ నూడుల్స్ మార్కెట్ దేశాల్లో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఆక్ర‌మించింది. నూడుల్స్ ను ర‌క‌ర‌కాలుగా త‌యారు చేసి, పిల్ల‌ల్ని పెద్ద‌ల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది.  అయితే ఈ ఫుడ్ ఐటం లో గ‌తంలో బ‌ల్లులు, క్రిములు , కీట‌కాల్ని భాగ‌స్వామ్యం చేస్తున్నార‌నే వార్త‌లు విన్నాం. కానీ ఇప్పుడు మాత్రం నూడుల్స్ బ‌దులు పాముపిల్ల‌ల్ని వడ్డిస్తున్నార‌నే వార్త‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. చైనాలోని గాంగ్జీ యూనివ‌ర్సిటీ విద్యార్ధినికి బాగా ఆక‌లైంది. నూడుల్స్ తిందామ‌ని ఆర్డ‌ర్ ఇచ్చేసి తిందామ‌ని ఎదురు చూస్తుంది.

వెయిట‌ర్ అంతలోనే వేడివేడి నూడుల్స్ తీసుకొచ్చి ఆ విద్యార్దిని ముందుంచాడు. అస‌లే ఆక‌లి..వేడివేడి నూడుల్స్ క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా స్పూన్ల‌మీద స్పూన్లు లాగించింది ఆ విద్యార్ధిని. ఇంత‌లోనే అచ్చం నూడుల్స్ లా ఉండే పాముపిల్ల‌లు ప్లేట్లో ప్ర‌త్య‌క్ష‌మయ్యాయి. దీంతో బేర్ మ‌న్న‌ విద్యార్ధి  విష‌యాన్ని క్యాంటీన్ దృష్టికి తీసుకెళ్లింది. నూడుల్స్ బ‌దులు పాముపిల్ల‌ల్ని స‌ర్వ్ చేస్తున్నార‌ని మొర‌పెట్టుకుంటూ వెంట‌నే నూడుల్స్‌లో ఉన్న పాము పిల్ల ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇక‌.. ఆ ఫోటో చైనాలో వైరల్ అయిపోయింది. దీనిపై స్పందించిన ఆహారపు శాఖ అధికారులు వర్శిటీ క్యాంటీన్‌‍పై రైడ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here