ఇండియా పాక్ ఫైనల్ మ్యాచ్ రోజు ఏమైందంటే .. – బన్నీ అనుభవం

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లూ అర్జున్ కి క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ విషయం ఆయన చాలాసార్లు మీడియా ముందర ఇది వరకే చెప్పారు. తనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా క్రికెట్ అనగానే పూర్తిగా టైం కేటాయిస్తా అని చెప్పిన బన్నీ కీలకమైన ఫైనల్ మ్యాచ్ లు అయితే అసలు మిస్ అవ్వను అన్నాడు . మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఇండియా ఓడిపోవడం తనకి చాలా బాధ కలిగింది అని చెప్పుకొచ్చాడు . ” నాకు ఇండియా ఓడిపోయినందుకు చాలా బాధేసింది అది నిజమే కానీ పాకిస్తాన్ వండర్ఫుల్ గా ఆడింది.

ఇండియా ఓడిపోవడం గెలవడం మామూలే కానీ మనవాళ్ళు అంత చెత్తగా ఆడడమే ఎక్కువ బాధాకర విషయం. అత్యంత పేలవమైన ఇన్నింగ్స్ తో ఎక్కువ స్కోర్ తేడా తో ఓడిపోయారు అనేది చాలా ఇబ్బందికర అంశం. ఆఖరి వరకూ పోరాడి ఉంటె పరవాలేదు కానీ మొదట్లోనే చేతులు ఎత్తేసారు. అదే అసలు బాధ  ” అని చెప్పుకొచ్చాడు బన్నీ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here