విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ప‌నికిరాడా..? ఆలోచ‌న‌లో బీసీసీఐ

ఐసీసీ చాంపియ‌న్ ట్రోఫీలో పాక్ పై భార‌త్ ఘోర‌ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంపై కోహ్లీపై విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. కోహ్లీ త‌క్ష‌ణ‌మే కెప్టెన్సీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు కోచ్ ప‌ద‌వికి రాజీనామా చేసిన అనిల్ కుంబ్లేను మ‌ళ్లీ బాధ్య‌తలు చేప‌ట్టాలంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మూడు ఫార్మ‌ట్ల‌లో కీల‌క పాత్ర‌పోషించి అల‌రిస్తున్న కోహ్లీ కెప్టెన్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టి  జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. అయితే రానురాను కోహ్లీలో అహంపెరిగింద‌ని..అందుకే కుంబ్లేను కోచ్ గా తిర‌స్క‌రించాడ‌ని అంటున్నారు.
కోచ్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి కుంబ్లే రాక‌ను వ్య‌తిరేకిస్తూ త‌న పంతాన్ని నెగ్గించుకున్నాడు. అయితే పాక్ పై భార‌త్ ఓడిపోవ‌డంతో కోహ్లీ కెప్టెన్ గా ప‌నికిరాడంటూ …ప్ర‌పంచ‌క‌ప్ ను అందించిన ధోనీని మ‌ళ్లీ కెప్టెన్  చేయాలంటూ అభిమానులు కోరుతున్నారు. జ‌ట్టు సంక్షోభంలో ఉన్న‌ప్పుడే  కుంబ్లేని వ్య‌తిరేకించ‌డం..డ్ర‌సింగ్ రూంలో కుంబ్లేను విమ‌ర్శించ‌డంలాంటివి కోహ్లీ కెప్టెన్ గా ప‌నికాడ‌ని విమ‌ర్శిస్తున్నారు. కోహ్లీ అహం వల్లే కుంబ్లే తన పదవికి రాజీనామా చేశాడని, మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు సైతం కోహ్లీని ఛీ కొడుతున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో కోహ్లీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. ‘టీమిండియాను సమర్థవంతంగా నడిపించేంత శక్తిసామర్థ్యాలు కోహ్లీకి లేవు.
ఎంతో విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న ధోనీని తిరిగి టీమిండియా కెప్టెన్‌ చేయాలి’ అని ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఈ ట్విట్ల‌తో పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ బీసీసీఐ కోహ్లీ కెప్టెన్సీ పై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌లో క‌మిటీని ఏర్పాటు చేసి కెప్టెన్ గా ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే దానిపై క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here