1000 లైకుల‌ కోసం కొడుకును 15అంతస్తుల నుంచి వేలాడ‌దీసిన తండ్రి

నేటి జీవ‌న విధానంలో ప్ర‌తీ ఒక్క‌రికి సో్ష‌ల్ మీడియా ఓ భాగ‌మైంది. ముఖ్యంగా లైకులు, షేర్ల విష‌యంలో తాప‌త్ర‌య‌ప‌డిపోతూ ప్రాణాల‌మీద‌కు తెచ్చుకుంటున్నారు. అదే ప్రాణాల్ని తృణ ప్రాయంగా గాలికి వ‌దిలేస్తున్నారు. అలా ఓ వ్య‌క్తి వెయ్యి లైకులు కోసం త‌న కొడుకు ప్రాణాలు తీసే సాహసం చేశాడు. స్థానికుల స‌మాచారంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని జైలుకు త‌ర‌లించారు. అల్గేరియాకు చెందిన ఓ నెట‌నిజ‌న్ కు సోష‌ల్ మీడియా అంటే ప్రాణం లైకుల కోసం, షేర్ల కోసం ఎంత‌టి దారుణానికైనా సిద్ధంగా ఉంటాడు. అయితే రోజువారి దిన‌చ‌ర్య‌లో భాగంగా త‌న‌కు ఓ వెయ్యి లైకులు కావాలని ప‌ట్టుబ‌ట్టాడు.

లైకులు కావాలంటే ఏం చేయాలి. ర‌క‌ర‌కాల ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.అయినా ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో ఆ నెటిజ‌న్ ఇటీవల తను పోస్టు చేసిన ఫొటోకు వెయ్యి లైకులు రాకుంటే తన కొడుకును 160ఫీట్ల ఎత్తైన భవనం నుంచి కిందపడేస్తానని బెదిరించాడు. మూడేళ్ల చిన్నారిని అతడు వేసుకున్న టీషర్టును మాత్రమే పట్టుకుని 15అంతస్తుల భవనం బాల్కనీ నుంచి వేలాడతీస్తూ ‘నాకు వెయ్యి లైకులు ఇవ్వండి. లేదంటే చిన్నారిని వదిలేస్తా’ అంటూ ఫోటోలు  పెట్టాడు. దీంతో భ‌యాందోళ‌న‌కు గురైన నెటిజ‌న్లు చిన్నారిని కాపాడేందుకు వెయ్యిలైకులు కొట్టారు.

మరికొందరు మాత్రం చిన్నారిని హింసిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుణ్ని కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా చిన్నారి కింద‌ప‌డి చ‌నిపోతే ఎవ‌రి బాధ్య‌త‌..లైకుల కోసం కొడుకు ప్రాణం తీస్తావా అంటూ మండిప‌డ్డ జ‌డ్జీ అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here