ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లుకు షాకిచ్చే వార్త

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లుకు షాకిచ్చే వార్త ఒకటి వెలుగులోకి వ‌చ్చింది. `క్సెఫేకాపీ ట్రోజ‌న్‌` అనే కొత్త మాల్‌వేర్ స్మార్ట్‌ఫోన్లులో వినియోగ‌దారుడి బ్యాంక్ అకౌంట్ లో చొర‌బ‌డి డ‌బ్బుల్ని కాజేస్తున్న‌ట్లు తెలుస్తోంది. వైర్ లెస్ అప్లికేష‌న్ ప్రొటోకాల్ ద్వారా బ్యాంక్ లావేదేవీలను ప‌రిక్షించి డబ్బుల‌ను కాజేస్తుంద‌ని సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ కాస్ప‌ర్స్‌కీ నిపుణులు వెల్ల‌డించారు. బిల్లింగ్ ప‌ద్ద‌తుల్ని యూజ‌ర్ ను గంద‌ర‌గోళం సృష్టించి స్మార్ట్ ఫోన్ల‌లో ఆవైర‌స్ చొచ్చుకొని పోతుంది. ఎవ‌రైనా వైర‌స్ కు సంబంధించిన స‌ర్వీస్ ల‌ను యాక్టివేట్ చేస్తే అంతే సంగ‌తులు. వైర‌స్ ఎంత డ‌బ్బు కావాలి డిమాండ్ చేస్తుంది. అలా డ‌బ్బు చెల్లిస్తే ఫోన్ యాక్టివ్ అవుతుంది. లేదంటే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో మ‌నీని దొంగిలిస్తుంది. 47 దేశాల్లోని 4,800 మంది వినియోగ‌దారులు ఈ మాల్‌వేర్ కార‌ణంగా న‌గ‌దు కోల్పోయార‌ని ..కాబట్టి స్మార్ట్ ఫోన్ల‌లో కొత్త యాప్ ల‌ను ఇన్ స్టాల్ చేసుకునే ముందు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని  కాస్ప‌ర్స్‌కీ ద‌క్షిణాసియా ఎండీ అల్తాఫ్ ఆల్దే హెచ్చరించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here