నిన్న పెళ్లయింది ఇవాళ మొగుడ్ని జైల్లో పెట్టించింది .. వామ్మో ఇదెక్కడి పెళ్ళాం

నిన్ననే పెళ్లి అయ్యింది ఇవాళ మొగుడ్ని తీసుకెళ్ళి బందీ ఖానా లో పెట్టేసింది. చత్తీస్ ఘడ్ లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కోరియా పట్టణానికి చెందిన యువతికి, సమీప గ్రామంలోని ఓ యువకుడికి సోమవారం నాడు వివాహమైంది. పెళ్లి టైం లో వరుడు , అతని తరఫువారు అడిగిన కట్న కానుకలు అన్నీ సమకూర్చారు కూడా. పెళ్లి తరవాత తనని బాగా చూసుకుంటాడు అనుకుంటే ఆ వరుడు వెధవ వేషాలు వెయ్యడం మొదలు పెట్టాడు. అదనపు కట్నం, కూలర్, ఫ్రిజ్ తదితర వస్తువులు కావాలని అతను డిమాండ్ చేశాడు.

వెంటనే అంటే కుదరదు అని పెళ్లి కూతురు తరఫు వారు అర్ధంయ్యేడట్టు చెప్పే ప్రయత్నం చేసారు. కానీ అతను వినలేదు. ఈ వ్యవహారాన్ని కొన్ని గంటల పాటు ఓర్పుతో చూసిన వధువులోని సివంగి బయటకు వచ్చింది. ఈ కట్న పిశాచి తనకు వద్దని చెబుతూ, ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు బయలుదేరింది. పోలీసులు వెంటనే అతన్ని అరస్ట్ చేసి జైల్లో పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here