పెళ్ళాం పిల్లలతో సహా పారిపోయిన ప్రసాద్ .. ఏం జరుగుతోంది అసలు ?

మియాపూర్ లో జరిగిన భారీ భూ కుంభకోణం లో గోల్డ్ స్టన్ ప్రసాద్ గా పేరున్న ప్రసాద్ ముఖ్యమైన నిర్దోషి గా ఫీల్ అవుతున్నారు పోలీసులు. ఆయన్ని సరిగ్గా కలిసి ఎంక్వైరీ చేసి నిజా నిజాలు తెలుసుకోవాలి అని ప్లాన్ చేస్తున్న టై లో పెళ్ళాం పిల్లలు ఫ్యామిలీ తో సహా ఆయన తప్పించుకున్నారు. ప్రసాద్ ఆచూకీ లభ్యం కాకపోవడం, ఆయనతో సహా ఆయన కుటుంబీకుల ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నట్టు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఆయన ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు ఓ అధికారి తెలిపారు.

ఆయన మీద మాత్రమె కాకుండా కోడలు మమత , భార్య ఇంద్రాణి ల మీద కూడా కేసులు నమోదు అయ్యాయి. ప్రసాద్ కొడుకు ఇప్పటికే పోలీసుల సమక్షం లో ఉన్నాడు. ఎల్బీనగర్, మైలార్ దేవ్ పల్లి, బాలానగర్ ప్రాంతాల్లో జరిగిన భూముల క్రయ విక్రయాల్లో అవకతవకలు జరిగాయని, వాటి వెనుక ప్రసాద్ హస్తం ఉన్నట్టు సాక్ష్యాలు లభించాయని పోలీసు వర్గాలు అంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here