ఛీ విమానం లో బల్లి … దూకేయ్యాలి అనిపించింది – హీరోయిన్ కోపం

దరిద్రగొట్టు , వరస్ట్ స్పైస్ జెట్ అంటున్నారు అమ్మాయిలు. ఈ మధ్య కాలం లో అమ్మాయిలకి స్పైస్ జెట్ అంటే ఒళ్ళు మండిపోతోంది. నటి రోహ్ సింగ్ , మాజీ మిస్ ఇండియా కూడా అయిన ఆమె చెన్నై వెళ్ళింది. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం వెళుతున్న టైం లో ఈ తలనొప్పి ఎదురు అయ్యింది. చెన్నై వెళ్లిన రూహి సింగ్ స్పైస్ జెట్ లో తనకు ఎదురైన ఊహించని అనుభవం గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రశాంతమైన ప్రయాణాన్ని ఆశించి, ఎక్కువ డబ్బు చెల్లించిమరీ స్పైస్‌ మాక్స్ సీటు కొనుగోలు చేశానని రూహి సింగ్ తెలిపింది.

అయితే అందుకు భిన్నంగా తాను ఓ బల్లి పక్కన కూర్చొని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చిందని వాపోయింది. తన సీటు కింద నుంచి వచ్చిన బల్లి, తన విండో పక్కన కాసేపు చక్కర్లు కొట్టి, లగేజ్ క్యాబిన్ లోపలికి వెళ్లిపోయిందని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here