ఫ్రెండ్ కోసం ఈమె చేసిన త్యాగం మనం ఎవ్వరం చెయ్యలేము

స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని పాటలు పాడుకోవడం కాదు స్నేహమే జీవితంగా బతికిన ఒక మహిళ కథ ఇది. అమెరికా లోని పెన్సిల్వేనియాకి చెందిన రిబాక్‌ సెయిడ్రోతో పాటు క్రిస్‌ మూర్‌ అనే వ్యక్తి ఒక రెస్టారెంట్‌ లో ఐదేళ్లపాటు కలిసి పనిచేశారు. చాలా మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఉద్యోగం రిత్యా కోల్పోయారు. ఎప్పటికప్పుడు ఫేస్ బుక్ లో టచ్ లో ఉంటున్న ఇద్దరూ రోజూ మాట్లాడుకునే వారు. గత సెప్టెంబర్ లో కొన్నాళ్ళు ఫేస్ బుక్ కి దూరంగా ఉన్న సేయిడ్రో క్రిస్ ఫేస్ బుక్ చూసి షాక్ అయ్యింది.
క్రిస్ మూర్ తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లో…తన కిడ్నీ పాడైపోయిందని, కిడ్నీ మార్పిడి అవసరమని పోస్టు చేశాడు. ఫ్రెండ్ కష్టం తన కష్టం గా ఫీల్ అయ్యి .. కిడ్నీ దానం చెయ్యడానికి సిద్దం అయ్యింది. అనేక పరీక్షలు చేసిన తరవాత ఆమెని బరువు తగ్గాలని వైద్యులు కోరగా దాదాపు ఇరవై కిలోల బరువు ని ఫ్రెండ్ కోసం ఆమె తగ్గింది. తన ఫ్రెండ్ కోసం ఆమె ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here