శశికపూర్ శ్రీదేవికి అంతర్జాతీయ స్థాయిలో నివాళులు

భారతీయ చలనచిత్ర అతిలోక సుందరి శ్రీదేవి మరణం సినిమా ప్రపంచాన్ని కలిచివేసింది. ఈ క్రమంలో గత ఏడాదే శశి కపూర్ కూడా మరణించారు మూడు నెలల వ్యవధిలోనే శ్రీదేవి మరణించడం సినిమా ఇండస్ట్రీ వారికి ఎంతో బాధను తెప్పించింది. ఈ ఇద్దరు నటులకు దేశం మొత్తం మీద చాలా మంది అభిమానులు ఉన్నారు.అయితే ఈ క్రమంలో వీళ్లు న‌టించిన ప‌లు చిత్రాలు విదేశాల్లో చ‌క్క‌ని ఆద‌ర‌ణ సంపాదించాయి. అందుకే ఆ ఇద్ద‌రికీ న్యూయార్క్ ఫిలింఫెస్టివ‌ల్‌లో సంతాప సంస్మ‌ర‌ణ స‌భ జ‌ర‌గ‌నుందని తెలుస్తోంది.
శ‌శిక‌పూర్ న‌టించిన‌ షేక్‌స్పియ‌ర్ వాలా, హీట్ అండ్ డ‌స్ట్ చిత్రాల్ని, శ్రీ‌దేవి న‌టించిన `ఇంగ్లీష్ వింగ్లీష్‌` చిత్రాన్ని ఈ ఏడాది మే 7 నుంచి మే12 వ‌ర‌కూ ఐదు రోజుల పాటు సాగే న్యూయార్క్ ఇండియ‌న్ ఫిలింఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శిస్తార‌ని తెలుస్తోంది. ఇక్క‌డే ఆ ఇద్దరికీ సంతాపం తెలియ‌జేసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డైంది. ఏదేమైనా భారతీయ చలనచిత్ర రంగానికి సంబంధించిన నటీనటులకు అంతర్జాతీయ స్థాయిలో నివాళులు అర్పించడం అంటే మామూలు విషయం కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here