సీబీఐ దెబ్బతింటున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం బాడ్ టైం నడుస్తున్నట్లుంది. ఎందుకంటే తొందరలోనే చంద్రబాబుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం గురించి జాతీయ స్థాయి నేతలు చర్చించుకుంటున్నారట. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం లో ఉండే ఐదుగురు ఐఏఎస్ అధికారులు తీవ్రంగా అవినీతి కార్యకలాపాలలో మునిగితేలుతున్నారని కేంద్ర నిఘా సంస్థలో వెల్లడయ్యింది. అసలు విషయం ఏమిటంటే…చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పై లేని అవినీతి ఆరోపణలు అన్నీ చంద్రబాబుపై రావడం జరిగింది.
దీంతో టీడీపీ మిత్రపక్ష పార్టీలు జనసేన బిజెపి కూడా పక్కకు తప్పుకున్నయి. అంతేకాకుండా తన మిత్రపక్ష పార్టీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల పార్టీ ఆవిర్భావ సభలో కూడా బహిరంగంగానే చంద్రబాబు అవినీతిపై ధ్వజమెత్తారు. ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థ సీబీఐ చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతికి స‌హ‌క‌రించిన ఐదుగురు ఐఏఎస్ అధికారుల‌ను మొద‌ట‌గా విచారించి, వారి నుంచి సాక్ష్యాధారాలు సేక‌రించిన త‌రువాత రెండో అడుగు వేయాల‌ని నిర్ణ‌యించింద‌ట సీబీఐ.
స‌ర్కార్‌పై నేరుగా కేసులు పెడితే ఆధారాలు తారుమార‌వుతాయ‌ని, అందుకే మొద‌ట అవినీతికి స‌హ‌క‌రించిన వారిని విచారించి, ఆ త‌రువాత స‌ర్కార్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌ది సీబీఐ ఆలోచ‌న‌గా ఉన్న‌ట్టు ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సందర్భంగా నిజాలు బయట పడితే మాత్రం తన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా కనుమరుగవుతుందని అనుకుంటున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here