సరిగ్గా మాట్లాడకపోతే పవన్ కల్యాణ్ ని కోర్టుకీడుస్తాం: లోకేష్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ ట్రై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. గుంటూరు ఆవిర్భావ సభ లో పవన్ కళ్యాణ్ లోకేష్ రాష్ట్రంలో చేస్తున్న అవినీతి కి హద్దులు లేవని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో హుందాగా వ్యవహరించాలని అన్నారు…ఎవరి మీద పడితే వారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదని అన్నరు.
ఇంకా లోకేష్ మాట్లాడుతూ… 8 ఏళ్లుగా తన ఆస్తులు బహిరంగంగా ప్రకటిస్తున్నానని.. అంతకు మించి ఎక్కువ ఆస్తులుంటే తీసుకోండని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో తనపై దుమ్మెత్తి పోస్తే, తాను దులుపుకుని పోవాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ చేసిన నిరాధారమైన ఆరోపణలపై తాను స్పందించాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకే పవన్ రేటింగ్ ఇస్తారా? అంతేకాదు చంద్రబాబుకు రెండున్నర మార్కులు వేయడానికి పవన్‌కల్యాణ్‌ ఎవరని ప్రశ్నించారు అంటూ ధ్వజమెత్తారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పరువునష్టం దావా వేయాలా? వద్దా? అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుందని కూడా చెప్పారు. ప్రస్తుతం లోకేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జగన్ అభిమానులు లోకేష్ చేసిన కామెంట్స్ కి సెటైర్లు వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here