బిగ్ బాస్ షో సీజన్ 2కి హోస్ట్‌గా నాని భారీ పారితోషకం

తెలుగు బుల్లితెర పై మా టీవీ ప్రసరించిన బిగ్ బాస్ షో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ షో కార్యక్రమానికి హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు అని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఈ షోకు సౌత్‌లోనే నంబ‌ర్ 1 పారితోషికం అందుకున్న ఏకైక హోస్ట్‌గా తార‌క్ పేరు మార్మోగిపోయింది.
చిరంజీవి నాగార్జున కంటే ఎక్కువగా ఎన్టీఆర్ తీసుకోవడం విశేషం. అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ షో సీజన్ 2 కి ఎన్టీఆర్ హోస్ట్‌గా కాద‌న్నాడ‌ని ప్ర‌చార‌మవుతోంది. ఆ క్ర‌మంలోనే ఆ అవ‌కాశం బ‌న్ని, నాని లేదా రానాల్లో ఎవ‌రో ఒక‌రికి వెళుతుంద‌ని సామాజిక మాధ్య‌మాల్లో ప్రాచ‌ర‌మైంది. తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. ఆ అవ‌కాశం నానీకే ద‌క్కింద‌ని తెలుస్తోంది.
అయితే ఈ షో కోసం నానీకి ఏకంగా 6 కోట్ల పారితోషికం చెల్లిస్తున్నార‌ని తెలుస్తోంది. బుల్లి తెర హోస్టింగ్‌లో ఇంత పెద్ద పారితోషికం అంటే ఆషామాషీ కానేకాదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నానికి మంచి క్రేజ్ తో పాటు వరుసగా విజయాలు కూడా ఉన్నాయి..దీంతో బిగ్ బాస్ షో సీజన్ 2కి హోస్ట్‌గా నాని ని తీసుకుంటున్నట్లు  తెలుస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here