రంగస్థలం సినిమా తర్వాత మరొక మెగా హీరోతో సుకుమార్ సినిమా

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం సినిమా తీయడం జరిగింది. ఈ క్రమంలో ఈ సినిమా భారీ హిట్ అయితే మాత్రం తన తర్వాత సినిమా కూడా మెగా కాంపౌండ్ లో హీరోతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి ఒక కథ చెప్పారంట సుకుమార్…కథ బాగానే అనిపించినప్పటికీ, ‘రంగస్థలం’ ఫలితం చూసిన తరువాత ఓకే చెప్పవచ్చనే ఉద్దేశంతో చిరూ వున్నట్టుగా చెబుతున్నారు.
ఇక గతంలో సుకుమార్ తో ‘ఆర్య’ .. ‘ఆర్య 2’ చేసిన అల్లు అర్జున్ కూడా, ఆయనతో ఒక సినిమా చేయాలని భావిస్తున్నాడట. అయితే ‘రంగస్థలం’ విడుదలైన తరువాతనే ఒక నిర్ణయానికి రావాలనేది ఆయన ఆలోచన. ఏం జరుగుతుందో చూడాలి మరి. రంగస్థలం సినిమా ఈనెల 30న విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది.  తాజాగా ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here