ఆంధ్రరాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన ప్రధాన హామీలలో ఒక హామీ ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇంటికి కాదుగదా గ్రామానికి జిల్లాకి కనీసం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేక పోయారు. దీంతో చంద్రబాబు పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు యువత తమ భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళనలో  పడ్డారు. అయితే ఈ క్రమంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా రాష్ట్రంలో ఉన్న పద్నాలుగు విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న మొత్తం పదకొండు వందల తొమ్మిది అసిస్టెంట్ ప్రోపెషర్ల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయం గురించి మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుండి పదమూడు వరకు అర్హులైన వార్ని నియమించడం జరుగుతుందని ..ఈ ప్రక్రియ అంతా ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతుందని ఆయన తెలిపారు. Global తాజాగా తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయం నిరుద్యోగులతో పాటు రాష్ట్రంలో చదువుకుని కళాశాల నుండి బయటకు వస్తున్నా వారికి కూడా ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇలాగే ప్రతి సంవత్సరం పోస్టులను భర్తీ చేస్తే రాష్ట్రంలో నిరుద్యోగం ఉండదని అంటున్నారు మేధావులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here