టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వైసిపి పార్టీలోకి

ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ రోజురోజుకీ బలపడుతున్న నేపథ్యంలో…ఆ పార్టీలోకి రావడానికి చాలా మంది ఆశపడుతున్నారు. ఇందులో ముందుగా టాలీవుడ్ కి చెందిన సినీ నటులు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ముందుగా టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ వైసీపీ లోకి రావడానికి తెగ ఉత్సాహపడుతున్నారు. వి.వి.వినాయక్ పార్టీలోకి వస్తున్నారని గతంలోనే వార్తలు రావడం జరిగాయి….అప్పట్లో వి.వి.వినాయక్ వైసీపీ లోకి రావడానికి జగన్తో మంతనాలు జరిపారని వార్తలు వచ్చాయి…ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా తెగ రచ్చ రచ్చ చేసింది.
అయితే గత ఎన్నికలలో గోదావరి జిల్లాలో వైయస్సార్ సిపి పార్టీకి చాలా తక్కువ స్థానాలు రావడంతో…జగన్ కూడా రాబోయే ఎన్నికల కోసం ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో వైయస్సార్ సిపి పార్టీలోకి వి.వి.వినాయక్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివి వినాయక్ కూడా ఈమధ్య రాజమండ్రి నియోజకవర్గంలో అస్తమానం వెలుతూ అక్కడ సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో కలుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో రాజమండ్రి నుండి బరిలోకి దిగాలని వినాయక్ ఆలోచిస్తున్నాడు అంట .
అంతే కాకుండా పార్లమెంటు నియోజక వర్గమైతే ఈ నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికే చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్న మండలాలు ఏడు ఉండటంతో వినాయక్ చేరిక కూడా పార్టీ బలోపేతం అవ్వడానికి దోహదపడుతుందని జగన్ కూడా భావిస్తున్నాడు అంట .దీంతో జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వైసీపీ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ క్రమంలో సినిమా రంగంలో రాణించినట్టు  రాజకీయ రంగంలో రాణిస్తారో లేదో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here