సినిమాలు తీయడం ఆపేస్తా అంటున్న దర్శకుడు?

తెలుగు సినిమా రంగంలో సరైన హిట్టు కొట్టడానికి నానా తంటాలు పడుతున్నాడు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ. ఈ క్రమంలో తాను చేసిన ప్రతి సినిమా వరుసగా పరాజయం పాలవడంతో తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టాడు కృష్ణవంశీ. తన చివరి సినిమా నక్షత్రం సినిమా కూడా దారుణంగా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవడం జరిగింది. ఈ క్రమంలో క్రిష్ణవంశి మినిమం క్రేజ్ ఉన్న హీరోలకి కథలు చెప్పినా వారు ఒప్పుకోవడం లేదు. అయితే ఈ క్రమంలో తాజాగా తేజ లాంటి దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి మళ్లీ సక్సెస్ లోకి తెచ్చిన హీరో రానానే నమ్ముకున్నాడట.

కొన్ని నెలల క్రితం వినిపించిన కాన్సెప్ట్ రానాకి నచ్చడంతో సానుకూలంగా స్పందించాడట. పూర్తిగా స్క్రిప్ట్ నచ్చితే షూటింగ్ స్టార్ట్ చేద్దామని అఫర్ కూడా ఇచ్చాడట. కానీ కృష్ణవంశీ రానా ని స్క్రిప్ట్ తో మెప్పించలేకపోయాడని తెలుస్తోంది. కథ బాగాలేదు అని చెప్పడంతో కృష్ణ వంశీ తన ప్రయత్నాలను ఆపేశాడు. దీంతో సినిమాలు తీయడం ఆపేద్దామన్నే ఆలోచనలో ఉన్నాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here