కన్నడ సినిమా పై మనసు పారేసుకున్న బాలకృష్ణ

ఈ సంవత్సరం మొదటి లో సంక్రాంతి పండుగకు ‘జై సింహ’ సినిమాతో వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆరంభంలోనే హిట్టు కొట్టాడు నందమూరి బాలకృష్ణ. దీంతో వచ్చిన విజయంతో తన తండ్రి ఎన్టీరామారావు జీవిత చరిత్రను ‘ఎన్టీఆర్ బయోపిక్’ తెరకెక్కిస్తున్నాడని ప్రకటన చేసి సంచలనం సృష్టించాడు. అయితే ఈ క్రమంలో ఈ సినిమా మొదలవడానికి విడుదలవడానికి ఆలస్యం అవటంతో…తన తర్వాత సినిమాల మీద దృష్టి పెట్టాడు బాలకృష్ణ. ఈ క్రమంలో కన్నడ లో సూపర్ హిట్ అయినా ఓ సినిమాను రీమేక్ చేయాలనీ బాలకృష్ణ గత కొంత కాలంగా ఆలోచిస్తున్నారట.
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ మఫ్టీ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఆ కాన్సప్ట్ బాలయ్యకు నచ్చడంతో సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారట. అయితే ఈ సినిమాను మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ సినిమా పూర్తయిన వెంటనే మొదలు పెట్టాలని బాలకృష్ణ అనుకుంటున్నారట. ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను ఎన్నికల నేపథ్యంలో విడుదల చేయాలని భావిస్తున్నాడు బాలకృష్ణ. దీంతో ఈ సినిమా అయిన వెంటనే కన్నడ సినిమా మఫ్తి ని తెలుగులో తీయాలనే ఆలోచనలో ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here