హీరోయిన్ లు వేశ్యలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత భార్య

ప్రముఖ తమిళ నిర్మాత స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ అదినేత జ్ఞానవేల్ రాజా భార్య నేహా సంచలన వ్యాఖ్యలు చేసింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు కుటుంబాలను కూర్చేవారు అంటూ… వేశ్యలు అంటూ తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలో అందరి హీరోయిన్లు గురించి నేను మాట్లాడటం లేదు అంటూ….కొందరిని ఉద్దేశించి మాత్రమే నేను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అంది. తప్పుడు దారిలో వెళ్తూ… ఆనందంగా ఉన్న కుటుంబాల్లో సమస్యలను సృష్టించే వారిని శిక్షించాలని ఆమె పేర్కొన్నారు.
భర్తలను నియంత్రించడం భార్యల బాధ్యత అని… బరితెగించే భార్యలను నియంత్రించాల్సిన బాధ్యత భర్తలదని చెప్పారు. ఇలాంటి మహిళలను తాను పబ్లిక్ లో కొడతానని అన్నారు. అయితే కాసేపటికే ఆమె తన ట్వీట్లను డిలీట్ చేశారు. తర్వాత మళ్లీ తన భర్తతో ఎటువంటి సమస్యలేదని కొత్త ట్వీట్ చేశారు. పెళ్లయినా మగవారిని ముగ్గులోకి దించుతున్న కథానాయికల మీదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాన్నని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here