చంద్రబాబు మేము ఇంకా బ్రతికే ఉన్నాం

ముఖ్యమంత్రి చంద్రబాబు వై.యస్.ర్ పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ మొత్తం 40 ఏళ్ల జీవితాన్ని బయట పెట్టారు. నాడు ఇందిరాగాంధీకి చెప్పి దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించానంటూ వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.
అలాగే, ఇటీవ‌ల అసెంబ్లీలో మాట్లాడుతూ.. నాడు ఇందిరా గాంధీని రాజ‌కీయంగా ఎదుర్కొన్న ఘ‌న‌త ఒక్క టీడీపీకే చెందుతుంద‌ని, ఆ స‌మ‌యంలో తానే(చంద్ర‌బాబు) ఇందిరాగాంధీపై యుద్ధం ప్ర‌క‌టించానంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌కు అసెంబ్లీలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా బ‌ల్ల‌లు చ‌రుస్తూ హ‌ర్షాతిరేఖాలు వ్య‌క్తం చేశారు కూడాను. అయితే, చంద్ర‌బాబు నిజంగానే ఇందిరాగాంధీని ఎదుర్కొన్నారా..? వైఎస్ఆర్‌కు టిక్కెట్ ఇప్పించింది చంద్ర‌బాబేనా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అప్ప‌టి రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ సంచ‌ల‌న నిజాలు చెప్పారు.
ఇందిరాగాంధీని టీడీపీ ఎదుర్కొన్న‌ప్పుడు చంద్ర‌బాబు టీడీపీ పార్టీలోనే ఉన్నార‌ని, కాంగ్రెస్‌లోనే ఉంటూ ఇందిరాగాంధీని ఎలా ఎదుర్కొన్నారంటూ చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు ఉండ‌వ‌ల్లి. ఇక రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ తానే ఇప్పించానంటూ చంద్ర‌బాబు డ‌ప్పుకొట్ట‌కోవ‌డాన్ని ఉండ‌వ‌ల్లి త‌ప్పుబ‌ట్టారు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మొద‌టిసారి ఎమ్మెల్యేగా గెలిచింది రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆవుదూడ గుర్తుమీద‌ని గుర్తు చేశారు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌. అప్పట్లో రాజకీయాలు చేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు అంటూ బాబు కి హితవు పలికారు. చంద్రబాబు తన  40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కువుగా అబాద్ధాలు ఆడుతూ ఇప్పటి దాకా నేగ్గుకున్ని వచ్చారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here